టీ కప్పుతో చిత్తూరు మరియు పూతలపట్టు ఎమ్మెల్యేల సరదా ముచ్చట్లు
హానిబీ టీ దుకాణంలో సామాన్యులతో ఎమ్మెల్యేల టీ టైం... బిజీ షెడ్యూల్‌కు బ్రేక్.. టీ తాగుతూ ప్రజలతో మాటామంతి.... చిత్తూరు,(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): నిత్యం ప్రజా సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలు అధికారిక సమావేశాలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు సోమవారం సాయంత్రం కాసేపు తీరిక సమయాన్ని ఆస్వాదించారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే కె. మురళీమోహన్ చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లిలో ఉన్న హానిబీ టీ దుకాణాన్ని సందర్శించి సామాన్య ప్రజలతో కలిసి టీ తాగుతూ ఆత్మీయంగా ముచ్చటించారు.ఎలాంటి హడావుడి లేకుండా మందిమార్బలానికి దూరంగా సాధారణ కస్టమర్ల మధ్య కూర్చొని టీ సేవించారు. అక్కడికి వచ్చిన యువత ,స్థానికులు, వ్యాపారులతో పలకరించి వారి యోగక్షేమాలు...