ప్రతిభ అవార్డు అందుకున్న కలికిరి విద్యార్థిని
కలికిరి, జూలై 20 (రాజనీతి): కలికిరి మండలం తెల్లగుట్టపల్లి గ్రామానికి చెందిన గుండా సతీష్ కుమార్తె మదనపల్లిలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో ప్రతిభా అవార్డు అందుకుంది. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చేతుల మీదుగా ఆమెకు ప్రశంసాపత్రం, మెడల్‌తో పాటు రూ.20 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. విద్యార్థిని ప్రతిభకు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.