షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డు అందుకున్న శ్రీ చైతన్య విద్యార్థిని

పీలేరు, జూలై 20 (రాజనీతి): మదనపల్లిలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో పీలేరులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల సీఈసీ విద్యార్థిని జోయా తస్లీమ్‌కు ప్రతిభ అవార్డు ప్రదానం చేశారు. ఇంటర్మీడియట్‌లో 967 మార్కులు సాధించిన ఆమెకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చేతుల మీదుగా అవార్డు అందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ నాగార్జున రెడ్డి, అధ్యాపక బృందాన్ని అధికారులు అభినందించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు.