యూకేకు తిరుపతి నుంచి తొలి మామిడి గుజ్జు ఎగుమతి

తిరుపతి, జూలై 20 (రాజనీతి): భారత్–యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తిరుపతికి చెందిన శ్రీ వర్ష ఫుడ్స్ యూకేకు తొలి మామిడి గుజ్జు (మ్యాంగో పల్ప్) ఎగుమతి కంటైనర్‌ను ప్రారంభించింది. ఏపీడీఏ, డీజీఎఫ్‌టీఏ, ఉద్యాన శాఖ అధికారులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఒప్పందంతో రైతులు, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లో కొత్త అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. తిరుపతి నుంచి విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఇది కీలక మైలురాయిగా అభివర్ణించారు.