పౌరుల సమస్యలపై వెంటనే స్పందించాలి:చిత్తూరు కమిషనర్ నరసింహ ప్రసాద్

ప్రజా సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోండి... చిత్తూరు కార్పొరేషన్‌లో పీజీఆర్ఎస్‌కు 9 వినతులు... చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి వినతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హమైన వాటికి త్వరితగతిన పరిష్కారం చూపాలని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ పి.నరసింహ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించిన ఆయన, అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసే వేదిక అని పేర్కొన్నారు. ప్రజలు నమ్మకంతో అందించే ప్రతి...