కట్టమంచి, గంగినేని చెరువుల సుందరీకరణ వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్...
ఫుడ్ కోర్టులు, ఓపెన్ జిమ్‌లతో చెరువులను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే యోచన... అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష.. మురుగునీరు చెరువుల్లోకి రాకుండా చర్యలకు ఆదేశం... చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువు గంగినేని చెరువులను ఆధునిక సౌకర్యాలతో సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి రెండు చెరువులను ఎమ్మెల్యే ప్రత్యక్షంగా పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు.ముందుగా కట్టమంచి చెరువును సందర్శించిన ఎమ్మెల్యే చెరువు కట్టపై ప్రజలు సేదతీరేలా...