కేబినెట్ సమావేశంలో మంత్రులకు సీఎం విజయ్ కీలక ఆదేశాలు

చెన్నై, జూలై 20 (రాజనీతి): కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి విజయ్ మంత్రులకు క్రమశిక్షణ, పారదర్శకతపై కీలక ఆదేశాలు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు ఎలాంటి తావు ఉండదని స్పష్టం చేసిన ఆయన, అవినీతి ఆరోపణలు రుజువైతే సంబంధిత మంత్రిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. తనిఖీల పేరుతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు మంత్రులు వెళ్లవద్దని సూచించినట్లు సమాచారం. పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలనకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సమావేశంలో వెల్లడించినట్లు తెలిపారు.