డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 10 రోజుల జైలు శిక్ష

రేణిగుంట, జూలై 20 (రాజనీతి): మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి తిరుపతి ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు 10 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తారకరామనగర్, కారకంబాడికి చెందిన పి. వెంకటేష్ (30) కోర్టులో నేరాన్ని అంగీకరించడంతో మోటారు వాహనాల చట్టం సెక్షన్ 185(ఏ) ప్రకారం దోషిగా నిర్ధారించి 10 రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ప్రజలకు మరోసారి హెచ్చరించారు.