గుంటూరులో మళ్లీ కరోనా అలర్ట్.. జీజీహెచ్‌లో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు!
ప్రత్యేక వార్డులు, పరీక్షల కౌంటర్లు ఏర్పాటు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ సూచన గుంటూరు, జూలై 19: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్)లో మరో కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదుకావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. బాపట్ల జిల్లా కర్లపాలెంకు చెందిన వ్యక్తికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో వెంటనే ఆసుపత్రిలోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డులు సిద్ధం చేసిన అధికారులు, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచారు. రోగి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా,...