వ్యాధి నిరోధక టీకాలు ప్రతి చిన్నారి హక్కు

తలుపుల, జూలై 19 (రాజనీతి): చిన్నారులకు నిర్దేశిత సమయంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించడం ప్రతి తల్లిదండ్రి బాధ్యత అని తలుపుల పీహెచ్‌సీ వైద్యాధికారి డా. శ్రీగిరీష తెలిపారు. జూలై 20 నుంచి 27 వరకు మీజిల్స్-రుబెల్లా (ఎంఆర్) ప్రత్యేక టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 9–12 నెలలు, 16–24 నెలల పిల్లలకు టీకాలు తప్పనిసరిగా వేయించాలని, వలస కార్మికులు, మురికివాడలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాల్లోని పిల్లలను గుర్తించి టీకాలు వేయించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి కొండయ్య పాల్గొన్నారు.