బాలికల హాస్టల్ విద్యార్థినులకు పోలీసుల అవగాహన

తిరుపతి, జూలై 19 (రాజనీతి): జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ అదనపు ఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో న్యూ బాలాజీ కాలనీలోని ఏపీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, మహిళల భద్రత, మత్తు పదార్థాల దుష్పరిణామాలు, పోక్సో చట్టం, బాల్య వివాహాలు, చైల్డ్ లేబర్‌పై అవగాహన కల్పించారు. అలాగే 1930, 1972, 112 హెల్ప్‌లైన్ సేవల వినియోగం, సోషల్ మీడియా మోసాల నివారణ, నైతిక విలువలు, క్రమశిక్షణ, లక్ష్యసాధన, మానసిక ధైర్యంపై విద్యార్థినులకు మార్గనిర్దేశం చేశారు.