స్థానిక ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక
తిరుపతి, జూలై 19 (రాజనీతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కోడూరు రూరల్ సర్కిల్ పరిధిలోని పుల్లంపేట, పెనగలూరు, ఓబులవారిపల్లి, చిట్వేలు పోలీస్ స్టేషన్‌లకు చెందిన రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఎన్నికల్లో బెదిరింపులు, దాడులు, అక్రమ వసూళ్లు, గుంపులుగా తిరగడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రౌడీషీటర్ కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పూర్తి భద్రత కల్పిస్తామని పోలీసులు తెలిపారు.