ఒక్కసారి గంజాయికి బానిసైతే... భవిష్యత్తే బందీ అవుతుంది..... డీఎస్పీ శ్రీనివాసరావు

రేణిగుంట, జూలై 19 (రాజనీతి): నేటి యువతే రేపటి భారతదేశానికి శక్తి. అలాంటి యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు బానిసైతే అది ఒక వ్యక్తి జీవితానికే కాదని, కుటుంబానికి, సమాజానికి, దేశ భవిష్యత్తుకే ముప్పుగా మారుతుందని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు, అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు మార్గదర్శకత్వంలో రేణిగుంట సబ్‌డివిజన్ పరిధిలో డ్రగ్స్‌పై దండయాత్ర–2.0 కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతం చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం గాజులమాండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకపురం గ్రామ సమీపంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, గంజాయి వినియోగంపై అనుమానం ఉన్న వ్యక్తులకు ఆధునిక బయోచెక్ టెస్టింగ్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. ఈ...