దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి – సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవాలి
పార్లమెంట్‌లో చట్ట సవరణకు ప్రధాని మోదీని ఒప్పించాలి: ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు చీరాల: ఈ రోజు చీరాల బీచ్ రిసార్ట్‌లో దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా అంశంపై ఆంద్ర ప్రదేశ్ క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రైస్తవుల నాయకులు మేధావుల సమావేశంలో ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధంగా ఎస్సీ హోదా కల్పించడం సామాజిక న్యాయం సాధనలో అత్యవసరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై వెంటనే ఒత్తిడి తీసుకువచ్చి, పార్లమెంట్‌లో అవసరమైన చట్ట సవరణ జరిగేలా...