ఎస్సీ విద్యార్థులకు సువర్ణావకాశం.. విదేశీ ఉన్నత విద్యకు రాష్ట్ర ప్రభుత్వ అండ

అమరావతి, 2026 జూలై 18: ఎక్స్‌లెన్స్ కేంద్రాల్లో ఉచిత శిక్షణ.. ప్రతిభావంతులైన విద్యార్థులకు కొత్త దారులు ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో ఉన్న ఎస్సీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అవకాశాన్ని కల్పించింది. విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేక 'ఎక్స్‌లెన్స్ సెంటర్లు' ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేంద్రాల ద్వారా ఐఈఎల్టీఎస్ (IELTS), టోఫెల్ (TOEFL), జీఆర్‌ఈ (GRE), జీమ్యాట్ (GMAT) వంటి అంతర్జాతీయ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించడంతో పాటు వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కెరీర్ మార్గదర్శకతపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్థికంగా వెనుకబడినప్పటికీ ప్రతిభ కలిగిన ఎస్సీ విద్యార్థులు ప్రపంచ...