పలమనేరులో ఉచిత కంటి వైద్య శిబిరానికి సన్నాహాలు.. అమెరికా నాగరాజ్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం

అర్హులైన రోగులకు ఉచిత కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిర్వాహకుల వెల్లడి పలమనేరు, జూలై 18: పలమనేరు ప్రాంత ప్రజలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్వహించనున్న ఉచిత కంటి వైద్య శిబిరం, కంటి శస్త్రచికిత్స కార్యక్రమం ఏర్పాట్లపై సమన్వయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశం బైరెడ్డిపల్లి అమెరికా నాగరాజ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా శిబిరం నిర్వహణ, లబ్ధిదారుల నమోదు, కంటి పరీక్షల ఏర్పాట్లు, శస్త్రచికిత్సలకు ఎంపిక చేసే విధానం తదితర అంశాలపై నిర్వాహకులు సమగ్రంగా చర్చించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కంటి సంబంధిత సమస్యలకు నిపుణుల సలహాలు పొందాలని సూచించారు. సమావేశంలో మాట్లాడిన...