అవకాశం ఇస్తే ప్రతిభకు అవధులుండవు... ఎస్సీ విద్యార్థి పులి నిహాల్ దీప్ నీట్‌లో జాతీయ స్థాయి ఘన విజయం!

2026 జూలై 17: పట్టుదల, కృషి, లక్ష్యసాధనే విజయానికి నిజమైన మార్గమని మరోసారి నిరూపించాడు పులి నిహాల్ దీప్. ఎస్సీ (మాల) సామాజిక వర్గానికి చెందిన ఈ యువ విద్యార్థి NEET–2026లో ఆల్ ఇండియా 935వ ర్యాంక్ సాధించి రాష్ట్రానికే కాకుండా తన కుటుంబానికి, సమాజానికి గర్వకారణంగా నిలిచాడు. భాష్యం మెడెక్స్ విద్యాసంస్థలో శిక్షణ పొందిన నిహాల్ దీప్, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులతో పోటీపడి ఈ అద్భుత విజయాన్ని అందుకోవడం విశేషం. ప్రతిభకు అవకాశాలు కల్పిస్తే ఎలాంటి నేపథ్యం ఉన్న విద్యార్థులైనా ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఆయన విజయం చాటిచెబుతోంది. సమాజంలో విద్యే నిజమైన మార్పుకు ఆయుధమని విశ్వసించిన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల...