ఏపీలో మళ్లీ కరోనా కలకలంనెలరోజుల్లో నలుగురు మృతి.. 12 కొత్త కేసులు నమోదు – అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ సూచనలు

అమరావతి, జూలై 17: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. గత నెలరోజుల వ్యవధిలో రాష్ట్రంలో నలుగురు కరోనా బాధితులు మృతి చెందగా, 12 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నమోదైన కేసులు విడివిడిగా ఉండటంతో ప్రస్తుతం ఎలాంటి క్లస్టర్ వ్యాప్తి లేదని అధికారులు స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్ 26 నుంచి జూలై 16 మధ్య నమోదైన కేసుల్లో అధికంగా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారే ఉన్నట్లు పేర్కొన్నారు. కరోనా సోకిన అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసులు పరిమితంగానే...