మీసిల్స్, రూబెల్లా ప్రత్యేక టీకా డ్రైవ్‌ను సద్వినియోగం చేసుకోండి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య

మదనపల్లి, జూలై 17 (రాజనీతి): మీసిల్స్, రూబెల్లా (పొంగు, మూడు రోజుల తట్టు) వ్యాధుల నిర్మూలన లక్ష్యంగా ఈ నెల 20 నుంచి 27 వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక ఎంఆర్ టీకా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య తెలిపారు. శుక్రవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా టీకాల అధికారి డాక్టర్ ఉషశ్రీతో కలిసి ఆయన మాట్లాడారు. భారత ప్రభుత్వం 2026 డిసెంబర్ నాటికి మీసిల్స్, రూబెల్లా వ్యాధులను దేశం నుంచి పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుందని, అందులో భాగంగా మూడు విడతల్లో ప్రత్యేక టీకా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. తొలి విడత విజయవంతంగా పూర్తైందని, రెండో విడత...