నెల్లూరు జిల్లా కోట బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఆధార్ సేవలు మరియు తిరుపతి జిల్లా వెంకటగిరి బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయి...
నెల్లూరు జిల్లా(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): కోట బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఆధార్ సేవా కేంద్రం ద్వారా ప్రజలకు వివిధ ఆధార్ సంబంధిత సేవలు అందుబాటులో ఉన్నాయని బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు తెలిపారు.నెల్లూరు జిల్లా కోట మండలంతో పాటు పరిసర గ్రామాలు, పంచాయతీల ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కేంద్రంలో ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీ, చిరునామా మార్పులు చేయించుకోవడంతో పాటు చిన్నారులకు కొత్త ఆధార్ నమోదు కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సిమ్‌ల విక్రయం, పాత సిమ్‌ల రీప్లేస్‌మెంట్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.ప్రజలు కోట హెడ్‌క్వార్టర్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆధార్ సేవా కేంద్రాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. సేవలకు సంబంధించిన వివరాలు...