సీఎం చంద్రబాబు పర్యటనకు ముమ్మర భద్రతా ఏర్పాట్లు

మదనపల్లి, జూలై 16 (రాజనీతి): జూలై 18న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదనపల్లి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముమ్మర భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆధ్వర్యంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) నిర్వహించి హెలిప్యాడ్, సభా వేదిక, రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. ట్రాఫిక్, పార్కింగ్, భద్రతలో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, అదనపు ఎస్పీ వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.