బాల్య వివాహాలు సమాజానికి శాపం.. సరైన వయస్సులోనే వివాహం చేయాలి

మేళ్లచెరువు, జూలై 16 (రాజనీతి): అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు పూర్తికాకుండా వివాహం చేయడం చట్టరీత్యా నేరమని తలుపుల పీహెచ్‌సీ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సి. కొండయ్య తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మేళ్లచెరువులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో బాల్యవివాహాల వల్ల తల్లి, శిశు ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాలు, చదువుకు అంతరాయం, కుటుంబ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం నాగవేణి, మహిళా పోలీసులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, బాలికలు పాల్గొన్నారు.