వ్యక్తిగత ప్రచారానికి పార్టీ పేరును వాడొద్దు: జనసేన నాయకుల హెచ్చరిక...

పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు: చిత్తూరు జనసేన నేతలు... సొంత కార్యకర్తలపై ఆరోపణలు తగవు.. పిఓసి తీరుపై అసంతృప్తి... చిత్తూరు (జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): వ్యక్తిగత ప్రచారం కోసం పార్టీ పేరును వినియోగించడం మానుకోవాలని పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను జనసేన ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని చిత్తూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు స్పష్టం చేశారు. గురువారం చిత్తూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.పార్టీలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు తమ వ్యాఖ్యలు, వ్యవహార శైలిలో సంయమనం పాటించాలని నాయకులు సూచించారు. ముఖ్యంగా పార్టీ పీఓసీ స్థాయిలో ఉన్న వ్యక్తి సొంత పార్టీ కార్యకర్తలపైనే విమర్శలు చేయడం,...