రేణిగుంట ప్రభుత్వ ఆస్పత్రిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేయాలి
రేణిగుంట, జూలై 16 (రాజనీతి): రేణిగుంట ప్రభుత్వ ఆస్పత్రిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేసి 100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కొండ్రెడ్డి ఈశ్వరమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆస్పత్రిని సందర్శించి వైద్యులతో మాట్లాడిన ఆమె, పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా పడకలు, సిబ్బంది, 108 అంబులెన్స్, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఆస్పత్రికి ఉన్న నాలుగు ఎకరాల స్థలంలో ఆధునిక వైద్యసౌకర్యాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.