యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి జీవిత లక్ష్యాలపై దృష్టి సారించాలి... సీఐ మంజునాథ్ రెడ్డి

రేణిగుంట, జూలై 16 (రాజనీతి): యువత తమ జీవితాన్ని మలుపు తిప్పే విద్యార్థి దశలో చెడు వ్యసనాలకు, మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని గాజులమండ్యం సీఐ మంజునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పి సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ మంజునాథ్ రెడ్డి అద్వర్యంలో ఎస్‌ఐ హరీష, పోలీసు సిబ్బంది గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని వి.బి.ఆర్. కళాశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మంజునాథ్ రెడ్డి మాట్లాడుతూ నేటి కాలంలో మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు సమాజానికి పెద్ద సవాలుగా మారాయని, వాటి బారిన పడకుండా ప్రతి విద్యార్థి అప్రమత్తంగా...