డెంగీ నివారణకు ‘చెక్–క్లీన్–కవర్’ పాటిద్దాం:

మదనపల్లి, జూలై 16 (రాజనీతి): డెంగీ జ్వరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ ‘చెక్–క్లీన్–కవర్’ పద్ధతిని తప్పనిసరిగా పాటించాలని జిల్లా మలేరియా అధికారి రామచంద్ర రెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ పిలుపునిచ్చారు. డెంగీ వ్యతిరేక మాసోత్సవాల సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించి, దోమల నివారణ, శుక్రవారాన్ని డ్రై డేగా పాటించడం, నీటి నిల్వలను శుభ్రంగా ఉంచడం, మూతలు పెట్టడం, దోమతెరలు వినియోగించడం వంటి జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.