టీటీడీ చరిత్రలో రికార్డు.. ఒకే రోజులో రూ.97 కోట్ల విరాళాలు
తిరుమల, జూలై 16 (రాజనీతి): టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజులో రూ.97 కోట్ల విరాళాలు అందాయి. దాతల దర్శన సౌకర్యాలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు అమల్లోకి రానున్న నేపథ్యంలో పాత ప్రయోజనాలను పొందేందుకు భక్తులు భారీగా విరాళాలు సమర్పించారు. కేవలం 10 గంటల వ్యవధిలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా మొత్తం 2,460 మంది దాతలు విరాళాలు అందించగా, ఇద్దరు భక్తులు తలో రూ.1 కోటి చొప్పున విరాళం సమర్పించడం విశేషం.