ముద్రగడకు తుది వీడ్కోలు.. కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్

కాకినాడ జిల్లా, కిర్లంపూడి – జూలై 15 కాపు ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణంతో విషాదంలో మునిగిపోయిన కిర్లంపూడి గ్రామానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకుని నివాళులర్పించారు. ముద్రగడ పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించిన ఆయన, అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ముద్రగడతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేసుకున్నారు. ప్రజల సమస్యలపై రాజీలేని వైఖరితో నిలిచిన నాయకుడిగా, సామాజిక న్యాయం కోసం చివరి వరకు పోరాడిన ఉద్యమకారుడిగా ఆయనను అభివర్ణించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముద్రగడ లేని...