పిల్లల మధ్య వ్యవధి ఆరోగ్యకర కుటుంబానికి పునాది: డిప్యూటీ హెచ్‌ఈఓ మహమ్మద్ రఫీ

వాయల్పాడు, జూలై 15 (రాజనీతి): ప్రపంచ జనాభా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా చింతపర్తి పీహెచ్‌సీ పరిధిలోని కూరపర్తి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో మహిళలకు కుటుంబ నియంత్రణపై డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అవగాహన కల్పించారు. పిల్లల మధ్య సరైన వ్యవధి పాటించడం వల్ల తల్లి, శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. మాలా-ఎన్, ఛాయా మాత్రలు, ఐయూడీ, అంతర ఇంజక్షన్లు తదితర తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులపై వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.