ఆటో నుంచి జారిపడి ఆవు మృతి.. పాడి రైతుకు భారీ నష్టం

పుంగనూరు, జూలై 15 (రాజనీతి): పుంగనూరు మండలానికి చెందిన ఓ పాడి రైతుకు చెందిన ఆవు సంతకు తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ఆటో నుంచి కిందపడటంతో మృతి చెందింది. బుధవారం ఉదయం ఆవులను ఆటోలో ఎక్కించి పుంగనూరు సంతకు తీసుకెళ్తుండగా బాలాజీ థియేటర్ సమీపంలోని ఓం శక్తి ఆలయం వద్ద ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలైన ఆవు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో పాడి రైతుకు వేల రూపాయల నష్టం వాటిల్లగా, తన జీవనాధారాన్ని కోల్పోయిన బాధతో కన్నీరుమున్నీరయ్యాడు.