హైకోర్టు ఆదేశాలతో గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పునఃప్రారంభం

మదనపల్లె, జూలై 15 (రాజనీతి): హైకోర్టు ఆదేశాల మేరకు మదనపల్లెలోని ఎస్‌బీఐ కాలనీలో ఉన్న గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని బుధవారం అధికారికంగా తిరిగి ప్రారంభించారు. గత ఏడాది నవంబర్‌లో మూసివేసిన ఆస్పత్రిపై యాజమాన్యం న్యాయపోరాటం చేయగా, హైకోర్టు అనుమతి ఇవ్వడంతో డీఎంహెచ్‌వో డాక్టర్ లక్ష్మీ నరసయ్య, రెవెన్యూ అధికారులు, పోలీసులు సమక్షంలో ఆస్పత్రిని రీ-ఓపెన్ చేసి అనుమతి పత్రాలు యజమాని డాక్టర్ ఆంజనేయులుకు అందజేశారు. దీంతో ఆస్పత్రి సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి.