కాపు ఉద్యమానికి గుండెకాయగా నిలిచిన ముద్రగడ ఇక లేరు-ప్రజా ఉద్యమాల పథంలో చెరగని ముద్ర.. ఆంధ్ర రాజకీయాల్లో ఓ యుగానికి తెర

పీలేరు, జూలై 14 (రాజనీతి): కాపు సామాజిక వర్గం హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ప్రముఖ ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం కన్నుమూశారు. ఆయన మరణంతో రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, కాపు ఉద్యమ చరిత్రలోనూ ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. ప్రజా సమస్యలపై రాజీలేని వైఖరి, సామాజిక న్యాయం కోసం నిరంతర పోరాటం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. దీర్ఘకాలంగా ప్రజా జీవితంలో కొనసాగిన ముద్రగడ, రాజకీయ పదవులను కంటే ప్రజల మధ్య నాయకుడిగా గుర్తింపు పొందారు. కాపు వర్గానికి రాజ్యాంగబద్ధమైన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. అనేకసార్లు నిరాహార దీక్షలు చేపట్టడం, భారీ...