మై భారత్ పోర్టల్ నేషనల్ ఫస్ట్ ఛాలెంజ్‌లో జాతీయ స్థాయిలో 5వ స్థానం సాధించిన వెంకట లోకేష్

వీరబల్లి : కడప జిల్లా వీరబల్లి మండలంలోని ఎస్‌డీకేఆర్ (SDKR) డిగ్రీ కళాశాల విద్యార్థి స్వామికేరి వెంకటలోకేష్ మై భారత్ పోర్టల్ ఆధ్వర్యంలో ఇటీవల నెలరోజుల పాటు నిర్వహించిన నేషనల్ ఫస్ట్ ఛాలెంజ్ ఆన్‌లైన్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచారు.దేశవ్యాప్తంగా జరిగిన ఈ పోటీల్లో ఆయన జాతీయ స్థాయిలో 5వ స్థానం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి స్థానం సాధించినట్లు కళాశాల డైరెక్టర్ రవిశేఖర్ రెడ్డి, VRDS స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 17న లక్నోలో జరిగే కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చేతుల మీదుగా వెంకట లోకేష్ ప్రశంసాపత్రాన్ని...