పీలేరులో విషాదం.. ఆర్టీసీ బస్సు ప్రమాదంలో విద్యార్థిని మృతి

పీలేరు, జూలై 14 (రాజనీతి): అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పీలేరు ప్రభుత్వ ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయురాలు రహీమున్నీసా కుమార్తె అసిన్ తాజ్ (17) ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందింది. సమాచారం ప్రకారం, తన తల్లిని ప్రభుత్వ ఉర్దూ పాఠశాల నుంచి ఇంటికి తీసుకువచ్చేందుకు అయ్యప్పరెడ్డి కాలనీ నుంచి ద్విచక్ర వాహనంపై ఉర్దూ పాఠశాల వైపు వెళ్తుండగా, పీలేరు పాత బస్టాండ్ సమీపంలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అసిన్ తాజ్ బస్సు కిందపడింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు ఇటీవల ఎంసెట్‌లో అర్హత సాధించి, ఉన్నత విద్యలో...