గ్యారంపల్లి పాఠశాల డొనేషన్ల వ్యవహారంపై సమగ్ర విచారణకు ఎన్‌ఎస్‌యూఐ డిమాండ్
మదనపల్లి, జూలై 14 (రాజనీతి): కె.వి.పల్లి మండలం గ్యారంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో డొనేషన్ల పేరుతో వసూళ్ల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బహిర్గతం చేయాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దెల అమృత్ తేజ జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యంకు వినతిపత్రం అందజేశారు. గత ఐదేళ్ల డొనేషన్ల లెక్కలు, ఆడిట్ వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రధానోపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసు జారీ చేశామని, సమగ్ర విచారణ చేపట్టి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని డీఈవో హామీ ఇచ్చారు.