డొనేషన్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న హెచ్ఎం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ...విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ల పై కేసు నమోదు చేయాలి
మదనపల్లి, జూలై 13 (రాజనీతి): అన్నమయ్య జిల్లా కె.వి.పల్లి మండలం గ్యారంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ) జారీ విషయంలో డొనేషన్ పేరుతో డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ సంబంధిత ప్రధానోపాధ్యాయురాలిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే ఓ దళిత విద్యార్థి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌లపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌కు...