మాదిగల భూ సమస్యలు, ఇంటి స్థలాల మంజూరుపై ఆర్డీవోకు వినతి
పీలేరు, జూలై 13 (రాజనీతి): పీలేరు మండలంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన పేద కుటుంబాలు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, ఇంటి స్థలాల కొరత, స్మశాన వాటికల లేమి వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎండీపీఎస్ నాయకులు సోమవారం అన్నమయ్య జిల్లా పీలేరు రెవెన్యూ డివిజనల్ అధికారి ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎండీపీఎస్ నాయకులు ఆర్డీవోతో మాట్లాడుతూ పీలేరు మండలంలోని అనేక గ్రామాల్లో మాదిగ కుటుంబాలు తరతరాలుగా సాగు చేస్తున్న భూములకు రికార్డులు ఉన్నప్పటికీ, కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి వాటిని అక్రమంగా కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి ఘటనలపై సమగ్ర విచారణ చేపట్టి, నిజమైన హక్కుదారులకు...