జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సీఐలు

మదనపల్లి, జూలై 13 (రాజనీతి): అన్నమయ్య జిల్లా పోలీసు శాఖలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఇద్దరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు సోమవారం మదనపల్లిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. ఇటీవల రాయచోటి ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఏ. చాంద్ బాషా, జిల్లా సైబర్ క్రైమ్ అండ్ సోషల్ మీడియా సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఎన్. శేఖర్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో వారు జిల్లా ఎస్పీని కలిసి తమ విధుల నిర్వహణపై మార్గదర్శకాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన అధికారులు సంప్రదాయ పుష్పగుచ్ఛాలకు బదులుగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పూల మొక్కలను ఎస్పీకి అందజేశారు. ఈ చర్యను...