ప్రభుత్వ పాఠశాలల్లో డొనేషన్ల వసూళ్లపై విచారణ జరపాలి: ఎన్‌ఎస్‌యూఐ

పీలేరు, జూలై 13 (రాజనీతి): కె.వి.పల్లి మండలం గ్యారంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో డొనేషన్ల పేరుతో వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ఆర్డీవో నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రధానోపాధ్యాయురాలిపై వచ్చిన ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకోవాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దెల అమృత్ తేజ కోరారు.