డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. విద్యార్థులకు పోలీసుల అవగాహన

రాయచోటి, జూలై 13 (రాజనీతి): అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు రాయచోటి శ్రీ సాయి కళాశాలలో ఈగల్ సెల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ మాట్లాడుతూ మత్తు పదార్థాల నుంచి పిల్లలను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద డ్రగ్స్ నేరాలకు కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. మత్తు పదార్థాల సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని సూచిస్తూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పోలీసులు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.