యూరియా కొరత లేదు.. బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు: జేసీ శివ్ నారాయణ శర్మ
మదనపల్లి, జూలై 13 (రాజనీతి): అన్నమయ్య జిల్లాలో ఖరీఫ్–2026 సీజన్‌కు రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎరువుల పంపిణీ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయించడం, నల్లబజారు, అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఆర్‌బీకేలు లేదా గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే ఎరువులు కొనుగోలు చేసి అధికారిక రసీదు తీసుకోవాలని సూచించారు.