చెక్–క్లీన్–క్లోజ్ విధానంతో దోమల నివారణ సాధ్యం

మదనపల్లి, జూలై 13 (రాజనీతి): డెంగీ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని, వారు పాఠశాలలో నేర్చుకున్న ఆరోగ్య సందేశాలను తమ కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి చేరవేస్తే సమాజంలో విస్తృత స్థాయిలో చైతన్యం ఏర్పడుతుందని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న డెంగీ వ్యతిరేక మాసోత్సవాలలో భాగంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు మదనపల్లి అర్బన్ పరిధిలోని వివేకానంద మున్సిపల్ హైస్కూల్, బాపూజీ మున్సిపల్ హైస్కూల్ల్లో సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డెంగీతో పాటు దోమల ద్వారా వ్యాపించే ఇతర...