దివంగత మాజీ మంత్రి నల్లారి అమర్నాథ్ రెడ్డికి ఘనంగా నివాళులు

కలికిరి, జూలై 13 (రాజనీతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశిష్ట ముద్రవేసిన దివంగత మాజీ మంత్రి, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న నల్లారి అమర్నాథ్ రెడ్డి 39వ వర్ధంతిని కలికిరి మండలం నగిరిపల్లిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన సమాధి వద్ద మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మా తండ్రి నల్లారి అమర్నాథ్ రెడ్డి...