ఆశా కార్యకర్తలు మరింత బాధ్యతతో పనిచేయాలి – జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జి. ఉషశ్రీ
అన్నమయ్య, జూలై 13 (రాజనీతి): ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లి–శిశు సంక్షేమ కార్యక్రమాలను గ్రామీణ స్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు చేసి, ప్రతి గర్భిణీ, ప్రతి చిన్నారికి సకాలంలో ఆరోగ్య సేవలు, టీకాలు అందేలా ఆశా కార్యకర్తలు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నమయ్య జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జి. ఉషశ్రీ సూచించారు. ఆశా నోడల్ అధికారుల నెలవారీ సమీక్ష సమావేశం డాక్టర్ జి. ఉషశ్రీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న మాతా–శిశు ఆరోగ్య కార్యక్రమాల పురోగతి, టీకాల కార్యక్రమం, యూ-విన్ పోర్టల్ నిర్వహణ, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డాక్టర్ ఉషశ్రీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన...