రెండు చోట్ల ఓటు కలిగి ఉండటం చట్టరీత్యా నేరం – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్

రేణిగుంట, జూలై 13 (రాజనీతి): ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, తప్పులులేని విధంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, అనర్హుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడమే ఈ ప్రత్యేక సర్వే ప్రధాన ఉద్దేశ్యమని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. రేణిగుంట మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను శనివారం పరిశీలించిన అనంతరం బూత్ లెవల్ ఆఫీసర్లు, రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ...