గ్యారంపల్లి జడ్పీ హైస్కూల్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తేవాలి
పీలేరు, జూలై 12 (రాజనీతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి డొనేషన్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు అత్యంత ఆందోళనకరమని, అలాంటి ఘటనలు ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు కలిగిస్తాయని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత్ తేజ అన్నారు. అన్నమయ్య జిల్లా కె.వి.పల్లి మండలం గ్యారంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థి నాగార్జున నుంచి టీసీ ఇచ్చే సమయంలో డొనేషన్ పేరుతో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అమృత్ తేజ మాట్లాడుతూ, పాఠశాల యాజమాన్య...