చిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి –ఆటో, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
జూలై 21న పుంగనూరులో ఏఐటీయూసీ జనరల్ బాడీ సమావేశం విజయవంతం చేయండి* *సాంబశివ, ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి* పుంగనూరు, రాజనీతి,రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులు, చిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ,చిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు.శనివారం పుంగనూరు స్థానిక ప్రశాంత్ నగర్ లో ఏఐటీయూసీ పుంగనూరు పట్టణ అనుబంధ సంఘాల నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ చిరుద్యోగులకు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, కనీస వేతనాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి హక్కులు కల్పించడంతో పాటు, ఉద్యోగ రక్షణకు చట్టపరమైన హామీ ప్రభుత్వం ఇవ్వాలని కోరారు....