ఏపీలో గృహోపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి కుకూ ఎలక్ట్రానిక్స్ హెచ్‌వోడీ చో హన్ చుల్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
సియోల్ (సౌత్ కొరియా): గృహోపకరణాలు, నీరు, గాలి శుద్ధి పరికరాల సంస్థ కుకూ(Cuckoo) ఎలక్ట్రానిక్స్ (దక్షిణ కొరియా) ఓవర్సీస్ సేల్స్ & మార్కెటింగ్ హెచ్‌వోడీ చో హన్ చుల్ (Mr. Cho Hanchul), ఆసియా రీజియన్ ప్రతినిధులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... శ్రీసిటీలోని గృహోపకరణాల క్లస్టర్ లో అంబర్, ఈప్యాక్ డ్యూరబుల్, డైకిన్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మొదలైనవి సంస్థలు ఉన్నాయి. దేశంలో 40% ఏసీలు, 35% టీవీలు ఆంధ్రప్రదేశ్ లో తయారవుతున్నాయి. ఇందుకు అవసరమైన స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అందుబాటులో ఉంది. ఇక్కడ నుంచి ఆగ్నేయ, మధ్యప్రాచ్య దేశాలకు...