పీలేరు ఆర్‌ఓబీ పనుల్లో జాప్యం.. ప్రజల ఆగ్రహం, భారీ ధర్నా

కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటూ మండిపడ్డ ప్రజా సంఘాలు.. వెంటనే పనులు పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి.... పీలేరు, జూలై 10: పీలేరు పట్టణంలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) పనులు నెలల తరబడి నత్తనడకన సాగుతుండటంతో పట్టణ ప్రజలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం భారీ ధర్నా నిర్వహించారు. ఆర్‌ఓబీ నిర్మాణం ఆలస్యం కావడంతో ప్రజలు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవలకు వెళ్లే ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పనులు ప్రారంభించి చాలా కాలం గడిచినా ఇప్పటికీ పూర్తి కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. ధర్నాలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ,...