జాతీయ స్థాయి SOF ఒలింపియాడ్‌లో ఖాన్స్ రైన్‌బో ఈ-స్మార్ట్ స్కూల్ విద్యార్థుల సత్తా

రేణిగుంట, జూలై 9 (రాజనీతి): దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ (ఎస్ఓఎఫ్) నిర్వహించిన జాతీయ స్థాయి ఒలింపియాడ్ పరీక్షల్లో ఖాన్స్ రైన్‌బో ఈ-స్మార్ట్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మరోసారి పాఠశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. జోనల్ స్థాయిలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధిస్తూ పలు విభాగాల్లో గోల్డ్, సిల్వర్ మెడల్స్, నగదు బహుమతులు, గిఫ్ట్ వౌచర్లు, మెరిట్ సర్టిఫికెట్లు అందుకొని తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా నిర్వహించే ఎస్ఓఎఫ్ ఒలింపియాడ్ పరీక్షలు విద్యార్థుల్లో సైన్స్, గణితం, ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్ వంటి సబ్జెక్టులపై అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార...